రేపు మోడీ, తర్వాత సిద్ధరామయ్య.. తెలంగాణకు పొరుగు నేతల క్యూ..!
ప్రధాని మోడీ మంగళవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీల ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొంటారు.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయి నేతలతో పాటు పొరుగు రాష్ట్రాల నేతలు సైతం ఆయా పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు తెలంగాణకు రానున్నారు. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది.
ప్రధాని మోడీ మంగళవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీల ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొంటారు. ఇక ఈ నెల 9న కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ వేస్తుండగా.. మరుసటి రోజు రేవంత్ రెడ్డి నామినేషన్ వేస్తారని తెలుస్తోంది. రేవంత్ నామినేషన్ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరవుతారని సమాచారం. అక్కడ కాంగ్రెస్ నిర్వహించే సభకు స్టార్ క్యాంపెయినర్‌గా హాజరవుతారని తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సిద్ధరామయ్య కౌంటర్ ఇస్తారని సమాచారం.
ఇక ప్రధాని మోడీ ఐదు రోజుల వ్యవధిలో మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈనెల 11న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ సామాజిక వర్గాల సభకు ఆయన హాజరు కానున్నారు. ఇప్పటికే నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మోడీ ప్రచారంపైనే రాష్ట్ర బీజేపీ ఆశలు పెట్టుకుంది.