రూ.234.80 కోట్ల చేనేత వస్త్రాల కోసం ఆర్డర్‌ వచ్చింది

ఈ కామర్స్‌ ద్వారా రూ.2.3 కోట్ల అమ్మకాలు : మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు

Advertisement
Update:2024-10-08 18:00 IST

రాష్ట్ర ప్రభుత్వంలోని పది శాఖల నుంచి 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ.234.80 కోట్ల విలువైన యూనిఫాంలు, బెడ్డింగ్‌ మెటీరియల్‌ కోసం టెస్కోకు ఆర్డర్లు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు. ఈ కామర్స్‌ ద్వారా రూ.2.3 కోట్ల అమ్మకాలు చేపట్టామని పేర్కొన్నారు. మంగళవారం సెక్రటేరియట్‌ లో చేనేత శాఖపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త డిజైన్లతో పీతాంబరి, గొళ్లభామ, ఆర్మూర్ సిల్క్, రామప్ప సిల్క్, టస్సార్ సిల్క్ చీరలు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. యార్న్‌ డిపోతో పవర్‌ లూమ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. స్వశక్తి మహిళలందరికీ ప్రభుత్వం నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులు శైలజా రామయ్యర్‌, రఘునందర్‌ రావు, యాస్మిన్‌ భాషా, శ్రీలక్ష్మీ, కార్పొరేషన్‌ చైర్మన్‌ లు అన్వేష్‌ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి, రాయల నాగేశ్వర్‌ రావు, గంగారెడ్డి, కాసుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News