మున్నేరుకి పెరిగిన వరద.. హైదరాబాద్-విజయవాడ వాహనాల దారి మళ్లింపు

విజయవాడ – హైదరాబాద్‌ హైవేపై మున్నేరు వరద 24 గంటల వ్యవధిలో మరింత పెరిగింది. మున్నేరు ప్రవాహం 2008 తర్వాత ఇదే అత్యధికం అంటున్నారు.

Advertisement
Update:2023-07-28 11:38 IST

హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఐతవరం వద్ద మున్నేరు వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం కంటే శుక్రవారం వరద ప్రవాహం మరింత పెరిగింది. దీంతో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి. దాదాపు 5కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్లపై బారులుతీరాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ప్రత్యామ్నాయ మార్గాలు..

కీసర వంతెన వద్ద మున్నేరు వరదనీరు పారుతుండడంతో.. విజయవాడ-హైదరాబాద్ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లేవారు.. హైదరాబాద్‌, నార్కట్‌ పల్లి, మిర్యాలగూడ, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంటుంది. విశాఖనుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సిన వారు కూడా ఆయా ఊళ్లపైనుంచే వెళ్లాల్సి ఉంటుంది.





2008 తర్వాత ఇదే..

విజయవాడ – హైదరాబాద్‌ హైవేపై మున్నేరు వరద 24 గంటల వ్యవధిలో మరింత పెరిగింది. మున్నేరు ప్రవాహం 2008 తర్వాత ఇదే అత్యధికం అంటున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలు తగ్గకపోవడంతో.. రేపటి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు. అత్యవసర సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ (7328909090)ని సంప్రదించాలని కోరారు. 

Tags:    
Advertisement

Similar News