కవితను చూసి కేసీఆర్ భావోద్వేగం..

కుమార్తెను గట్టిగా హత్తుకున్న కేసీఆర్, ఆమెను ఆశీర్వదించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Update: 2024-08-29 13:28 GMT

దాదాపు ఐదు నెలల తర్వాత బిడ్డను చూసిన ఆనందంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కళ్లు చెమర్చాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తొలిసారి తండ్రిని చూసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది. కుమార్తెను గట్టిగా హత్తుకున్న కేసీఆర్, ఆమెను ఆశీర్వదించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నిన్న రాత్రి కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తిరిగొచ్చారు. ఈరోజు భర్త, కుమారుడితో కలసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. ఆమెకు సిబ్బంది దిష్టితీసి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం కేసీఆర్ ని కలిశారు కవిత.


తన బిడ్డ కడిగిన ముత్యంలా కేసుల నుంచి బయటపడుతుందని గతంలో చాలా సందర్భాల్లో కేసీఆర్ ప్రస్తావించారు. కవితపై తప్పుడు కేసులు పెట్టారని, ఆ కేసుల నుంచి ఆమె బయటపడతారని, ఆమె ధైర్యంగా పోరాటం చేస్తారని అన్నారు. కవిత బెయిల్ విషయంలో బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ఎన్ని విమర్శలు వచ్చినా.. వాటన్నిటికీ నేతలు ధైర్యంగా సమాధానమిచ్చారు. బెయిల్ అనంతరం జైలు బయటకొచ్చిన తర్వాత కూడా కవిత ఎక్కడా తగ్గేది లేదన్నారు. తాను మరింత మొండిగా మారానని, న్యాయపోరాటం చేయడంలో వెనకడుగు వేయనని అన్నారు.

దాదాపు 5 నెలలపాటు కవిత జైలులో ఉన్నారు. ఆమెను చూసేందుకు, పరామర్శించేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి ఢిల్లీనుంచి హైదరాబాద్ వచ్చిన కవిత నేరుగా ఇంటికి వెళ్లి తల్లిని కలిశారు, సోదరుడు కేటీఆర్ కి రాఖీ కట్టారు. ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వచ్చి తండ్రి కేసీఆర్ ని కలిశారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఆమె త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశముంది. 

Tags:    
Advertisement

Similar News