గిరిజనులపట్ల బీజేపీ అలా.. గిరిజనులకోసం బీఆర్ఎస్ ఇలా

గిరిజనుల అభివృద్ధి విషయంలో కేంద్రం ఏమాత్రం చొరవచూపడం లేదని, పైగా అటవీ చట్టంతో గిరిజనుల హక్కులను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇక్కడి గిరిజనుల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఆమె శాసన మండలిలో వివరించారు.

Advertisement
Update:2023-08-05 13:59 IST

మణిపూర్ లో అల్లర్లు మళ్లీ మొదలయ్యాయి. మూడు నెలల క్రితం మొదలైన ఘర్షణలను ఇప్పటికీ అదుపు చేయలేకపోతోంది బీజేపీ ప్రభుత్వం. అసలు ఘర్షణలకు కారణం కూడా బీజేపీయేనని అంటున్నాయి ప్రతిపక్షాలు. ఈ విషయంలో కేంద్రంపై కూడా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మణిపూర్‌ లో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారామె. గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్రం అటవీ చట్టం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, పోడు భూముల పట్టాల పంపిణీపై శాసన మండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో కవిత మాట్లాడారు.

గిరిజనుల అభివృద్ధి విషయంలో కేంద్రం ఏమాత్రం చొరవచూపడం లేదని, పైగా అటవీ చట్టంతో గిరిజనుల హక్కులను కేంద్రం కాలరాస్తోందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇక్కడి గిరిజనుల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఆమె శాసన మండలిలో వివరించారు. గిరిజనుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే, తెలంగాణలో మాత్రం గిరిజనులు సంతోషంగా ఉన్నారని చెప్పారు.

తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లు 6నుంచి 9 శాతానికి పెంచుకున్నామని, దీని ద్వారా లక్షలమంది గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. గిరిజనులకు 4.05 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. పట్టాల ద్వారా 1.57 లక్షల మంది గిరిజన కుటుంబాలకు పోడు భూములపై హక్కులు లభించాయని వివరించారు. కల్యాణలక్షి, కేసీఆర్‌ కిట్‌, ఆరోగ్యలక్ష్మి పథకాలతో గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనం కలుగుతోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేలమంది ఎస్టీ విద్యార్థులకు జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు వచ్చాయని చెప్పారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం అని, జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.340 కోట్లు ఖర్చుచేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. గోండు, బంజారా లాంటి గిరిజనుల కళలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. గోండు భాషలో ప్రాథమిక విద్య పుస్తకాలు రూపొందించామన్నారు కవిత. 

Tags:    
Advertisement

Similar News