కేసీఆర్‌ తో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి భేటీ

ఎర్రవెల్లి ఫాం హౌస్‌ లో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ ను కలిసి మాజీ మంత్రి

Advertisement
Update:2024-10-15 18:40 IST

బీఆర్‌ఎస్‌ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ తో మాజీ మంత్రి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌ లో ఆమె పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్‌ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, రాజకీయ పరిస్థితులను సునీత లక్ష్మారెడ్డిని కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఆమె ఇంటీపై ఇటీవల కాంగ్రెస్‌ నేతలు చేసిన దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు తోనూ సునీత లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

Tags:    
Advertisement

Similar News