మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం
సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయంటే కారణం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు మంత్రి హరీష్ రావు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ఈ రోజు చెరువుల పండగ నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు.. ఊరూరా చెరువుల పండగ గురించి ట్వీట్ చేశారు. తెలంగాణలో చెరువుల పునర్జీవం గురించి వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణలో చెరువులు నిండుకుండల్లా ఉన్నాయంటే కారణం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.
నాడు ఎండి పోయిన చెరువులు..
నేడు నిండు కుండల్లా చెరువులు..
నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం..
నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునర్జీవం
అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం అయింది. అమృత్ సరోవర్ గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది. "తెలంగాణ ఆచరిస్తుంది... దేశం అనుసరిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు హరీష్ రావు.
మిషన్ కాకతీయ నిజంగానే దేశానికి ఆదర్శంగా నిలిచింది. గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేసుకుని, పూడికతో ఎండిపోయిన చెరువులను పునరుద్ధరించుకుని, నీటిని నిల్వ చేసేందుకు మిషన్ కాకతీయ దోహదపడింది. చెరువులు నిండటమే కాదు, భూగర్భ జల మట్టాలు పెరిగి పల్లెలు సస్యశ్యామలంగా మారాయి. మత్య్స సంపద పెరిగి మత్స్యకారులకు తిరిగి జీవనోపాధి లభించింది. మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 46వేల చెరువులను పునరుద్ధరించారు.