అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి : హరీష్ రావు
కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతు పిత అయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.;
బీఆర్‌ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత అయితే..సీఎం రేవంత్‌రెడ్డి బూతుల పిత అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ నుంచి ఏకపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేశారని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాటు తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని ఆయన అన్నారు. దేశానికి ఆదర్శం చేశారు. అలాంటి వ్యక్తి చావు కోరుకోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న సంస్కారానికి అద్దం పడుతోందని తెలిపారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపాలని స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.
గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డికి అధినేత కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌కు ఇదేనా? రేవంత్ రెడ్డి ఇచ్చే మర్యాద ఇదేనా అని హారీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వహనానికి పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ చావు కోరుకునేలా నిండు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. వెంటనే ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్షంలో ఉన్నపుడే సొంత పార్టీ నేతలను ట్రోలింగ్ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. గతంలో ఎల్‌ఆర్ఎస్ ఉచితంగా కట్టాలని కాంగ్రెస్ నేతలు చెప్పారు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చి.. ఎల్ఆర్ఎస్ కట్టి తీరాలని డబ్బులు చేయడం దారుణమని మండిపడ్డారు.