స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో హైటెన్షన్..రాజయ్య హౌస్ అరెస్ట్

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.;

Advertisement
Update:2025-03-16 11:05 IST

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరగబోయే సీఎం రేవంత్‌రెడ్డి సభను అడ్డుకుంటామని రాజయ్య అన్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. రాజయ్య నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఘన్‌పూర్‌ నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాజయ్యను పోలీసులు అరెస్ట్ చేయటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఈ నేపథ్యంలో.. స్టేషన్ ఘన్‌పూర్‌‌ నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ. 800 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు కీలక పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని బీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News