యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా;
Advertisement
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయాన్ని మిస్ యూనివర్స్ 2024 విజేత విక్టోరియా హెల్విగ్ దర్శించుకున్నరు. ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ విశిష్ఠతను తెలుసుకున్న విక్టోరియా, ఆలయ సందర్శన అనిర్వచనీయమని అన్నారు. మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న క్రిస్టినా.. తెలంగాణ పర్యటన సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం ఆమెకు శ్రీవారి ఫొటో, ప్రసాదాన్ని అందించారు.యాదగిరిగుట్ట ఆలయ విశిష్ఠతను, ఆలయ సంప్రదాయం సహా పలు వివరాలను విక్టోరియా అడిగి తెలుసుకున్నారు. ఈవో భాస్కర్ రావు ఆలయ విశిష్ఠతను మిస్ యూనివర్స్‌కు వివరించారు. అఖండ దీపారాధన చేసిన విక్టోరియా హెల్విగ్, ఆ తర్వాత మాట్లాడుతూ, ఆలయ సందర్శన అనిర్వచనీయమని పేర్కొన్నారు.
Advertisement