ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే బీసీ రిజర్వేషన్లు : బొల్లా శివ శంకర్
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమని ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివ శంకర్ అన్నారు.;
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచడానికి రేవంత్ ప్రభుత్వం రెండు వేరువేరు బిల్లులను పెట్టిందని యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివ శంకర్ అన్నారు. ఇవాళ బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితకి కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గిందని, అందుకు కవితకు ధన్యవాదాలు తెలిపారు. రెండు బిల్స్ పెట్టడంపై ఇవాళ ఎమ్మెల్సీ ట్లకవిత నివాసం వద్ద యూనిటైడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు సంబరాలు జరిపారు. సుదీర్ఘకాలంగా ఈ దేశంలో అన్నిరకాల అన్యాయాలకు గురైన బీసీ సోదరులకు రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను ప్రవేశ పెట్టడం స్వాగతిస్తున్నామని తెలిపారు.
శాసన సభలో బీసీ రిజర్వేషన్ చట్టం తీసుకువచ్చామని.. ఇంతటితో మా పనైపోయిందని అనుకోవద్దని.. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తమిళనాడు తరహా అన్ని రంగాల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించి, ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ బీసీ అంశాలపై ఎక్కడికి వెళ్లినా మాట్లాడుతున్నారని, బీసీల సంక్షేమంపై తమకే చిత్తశుద్ధి ఉందని బీజేపీ చెబుతుందన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని, బీసీలకు రాజ్యాధికారం ఇస్తామని మాట్లాడుతున్నాయన్నారు.