ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది.;
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. ఇన్నాళ్లకు నేను సీఎంగా ఉండగానే సమస్య పరిష్కారం కావటం సంతోషకరం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాం. షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను ఏమాత్రం మార్చకుండా ఆమోదించాం’’ అని తెలిపారు.59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి సంపూర్ణ మద్ధతు ఇస్తామని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేసింది.
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. చాతుర్వర్ణ వ్యవస్థ క్రమంగా పంచమ వ్యవస్థగా మారిందని కామెంట్ చేశారు.పంచములు అస్పృశ్యత, అంటరానితనానికి గురయ్యారని, వివక్షను రూపుమాపేందుకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపాలని మొదటి లోకూర్ కమిటీ 1965లోనే సూచించిందని పేర్కొన్నారు. మొదట పంజాబ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలైందని మంత్రి గుర్తుచేశారు.