సీఎం రేవంత్ రెడ్డితో గుమ్మడి నర్సయ్య భేటీ
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సీఎంను కలిశారు.;
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య భేటీ అయ్యారు. ఇల్లందు సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల ముఖ్యమంత్రిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు గుమ్మడి నర్సయ్య ప్రయత్నించగా అపాయింట్ మెంట్ లేదని భద్రతా సిబ్బంది ఆయనను లోనికి పంపించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై ఇటీవలే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సైతం స్పందించారు.
గుమ్మడి నర్సయ్య వచ్చిన విషయం తనకు ఆ సమయంలో తెలియదన్నారు తర్వాత తెలిసిన వెంటనే తన కార్యాలయ సిబ్బందితో నర్సయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ శాసన సభ సమావేశాల సందర్భంగా సీఎంతో గుమ్మడి నర్సయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలకు సంబంధించి సీఎంకు వివరించారు. వాటిని పరిష్కరించాలని సీఎం రేవంత్‌ను కోరారు. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు.