ఆ పని చేయండి.. కరీంగర్ నేతలకు కేటీఆర్ కీలక సూచనలు

రాబోయే మూడు నెలలో ప్రజల్లో ఉండాలని, వారికి దగ్గరగా ఉండి, వారితో మమేకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కరీంగర్ లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావాలని, ఆ దిశగా మన వ్యూహాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Update:2023-08-08 07:00 IST

ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతుండే సరికి పార్టీ నేతలను ఉత్సాహపరిచేందుకు వరుసగా మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలన్నారు. ఆ దిశగా ఇప్పటినుంచే కార్యాచరణ మొదలు కావాలని చెప్పారు.

ప్రజల్లో ఉండండి..

రాబోయే మూడు నెలలో ప్రజల్లో ఉండాలని, వారికి దగ్గరగా ఉండి, వారితో మమేకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కరీంగర్ లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావాలని, ఆ దిశగా మన వ్యూహాలు అమలు చేయాలని పిలుపునిచ్చారు. గెలుపుకోసం నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశా రు. పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయాలన్నారు.


జైత్రయాత్ర కరీంనగర్ నుంచే..

కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి జైత్రయాత్ర ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచే మొదలవుతుందన్నారు కేటీఆర్. ఇప్పటి వరకు జరిగిన సర్వేలు, నివేదికల్లో బీఆర్ఎస్ దే స్పష్టమైన ఆధిక్యత అని తెలుస్తోందని, దాన్ని మరింత పెంచే దిశగా నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కరీంనగర్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News