కేసీఆర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందన..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అర్భకులు కాదని, అర్జునులు అని వివరించారు మంత్రి కోమటిరెడ్డి.

Advertisement
Update:2024-04-24 11:48 IST

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 ఎంపీ సీట్లు వస్తాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. అదే జరిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ చెప్పినట్టుగా లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే తాను రాజీనామా చేస్తాన్నారు కోమటిరెడ్డి. తన సవాల్ కు బీఆర్ఎస్ నేతలు స్పందించాలన్నారు.

అర్భకులం కాదు, అర్జునులం..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అర్భకులు కాదని, అర్జునులు అని వివరించారు మంత్రి కోమటిరెడ్డి. తమ ఎమ్మెల్యేలు 25మంది బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్నారన్న వ్యాఖ్యలపై ఆయన ఇలా స్పందించారు. బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగేందుకు, ఆ పార్టీలోకి వెళ్లేందుకు తమ ఎమ్మెల్యేలు అర్భకులు కాదన్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.

ఆ పేర్లు చెప్పగలరా..?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని.. దమ్ముంటే వారి పేర్లు బయట పెట్టాలని సవాల్ విసిరారు మంత్రి కోమటి రెడ్డి. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే తాను రెడీ అని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ 100 రోజుల పాలనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలన్నిటికీ ఈ ఎన్నికలతోనే సమాధానం చెబుతామన్నారు కోమటిరెడ్డి. 

Tags:    
Advertisement

Similar News