మోడీజీ.. మీ బీజేపీ తిట్లతో కేసీఆర్ మరింత బలవంతుడిగా మారుతున్నారు : మంత్రి హరీశ్ రావు

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. నిత్యం తాను 2 నుంచి మూడు కిలోల తిట్లు తింటున్నానని అన్నారు.

Advertisement
Update:2022-11-13 12:27 IST
మోడీజీ.. మీ బీజేపీ తిట్లతో కేసీఆర్ మరింత బలవంతుడిగా మారుతున్నారు : మంత్రి హరీశ్ రావు
  • whatsapp icon

బీజేపీ నేతల తిట్లతో తెలంగాణ సీఎం మరింత బలవంతుడిగా మారుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశానికి, తెలంగాణకు ఏం చేశావని ప్రశ్నిస్తే.. ప్రధాని మోడీ మాత్రం తిట్ల పేరుతో పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంత వరకు భావ్యమని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రత్యర్థుల తిట్లే తనకు బలమని మోడీ చెప్పుకుంటున్నారు. కానీ నిత్యం టన్నుల కొద్దీ తిట్లను ఎదుర్కుంటున్న సీఎం కేసీఆర్ ఇంకెంత బలవంతుడిగా మారుంటారో ఆలోచించండని హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. నిత్యం తాను 2 నుంచి మూడు కిలోల తిట్లు తింటున్నానని అన్నారు. ఆ తిట్లే తనను బలవంతుడిగా మారుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు. దీనిపై టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో అభివృద్ధి విషయమై ప్రశ్నిస్తే.. మోడీకి తిట్టినట్టు వినిపించిందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణకు మోడీ ప్రభుత్వం ఏం చేసిందో వెల్లడించాలని అంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ.. దేశానికీ, తెలంగాణకు ఏం చేశావని మేము అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీ జీ..' అని మంత్రి హరీశ్‌ రావు ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.


Tags:    
Advertisement

Similar News