6 గ్యారెంటీలు కాదు..6 నెలలకో సీఎం.. హరీష్‌ సెటైర్లు

కాంగ్రెస్‌ వాళ్లు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కర్ణాటకలో ఇచ్చిన హామీల‌ను అమలు చేశాక ఇక్కడ మాట్లాడాలన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు.

Advertisement
Update:2023-09-19 15:45 IST

కాంగ్రెస్‌ గ్యారెంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్‌ చెక్‌ లాంటివన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలేమో కానీ.. ఆరు నెలలకో సీఎం మారడం ఖాయమన్నారు. ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ విధిస్తారని.. ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇస్తారంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో పింఛన్‌ 6 వందలు మాత్రమేనని, వికలాంగులకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. రైతు బంధు కర్ణాటకలో అమలు చేయట్లేదని చెప్పారు. కాంగ్రెస్‌ వాళ్లు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కర్ణాటకలో ఇచ్చిన హామీల‌ను అమలు చేశాక ఇక్కడ మాట్లాడాలన్నారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్‌ అవుతుందన్న హరీష్‌ రావు.. వారానికి రెండు పవర్‌ హాలి డేలు ఉంటాయన్నారు. తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరును చేస్తారని, ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని, ఎన్నిక‌ల ప్ర‌ణాళిక అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు.

నారాయణ్‌ ఖేడ్‌ నియోజకవర్గం శంకరంపేట్‌లో పర్యటించిన హరీష్‌ రావు.. వంద డబుల్‌ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఇదే సమయంలో 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. త్వరలోనే శంకరంపేట పొలాలకు కాళేశ్వరం నీళ్లందిస్తామన్నారు.

*

Tags:    
Advertisement

Similar News