ఇక కార్పొరేషన్‌లుగా మంచిర్యాల, మహబూబ్‌ నగర్‌

మరో 12 కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు.. రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు

Advertisement
Update:2024-12-20 17:49 IST

మున్సిపాలిటీలుగా ఉన్న మంచిర్యాల, మహబూబ్‌ నగర్‌ ను మున్సిపల్‌ కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన బిల్లు శనివారం తెలంగాణ అసెంబ్లీ ముందుకు రాబోతుంది. సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. రెండు కార్పొరేషన్లతో పాటు కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కోహిర్, గడ్డ పోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం, జనగామ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్, నారాయణపేట జిల్లాలో మద్దూర్, ఖమ్మం జిల్లాలో ఏదులాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట, మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర, రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మెయినాబాద్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. వాటికి సమీపంలోని పలు గ్రామ పంచాయతీలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేయనున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో సమీపంలోని ఆరు గ్రామాలు, పరిగి మున్సిపాలిటీలో ఆరు గ్రామాలు, నర్సంపేట మున్సిపాలిటీలో ఏడు గ్రామాలు, నార్సింగి, శంషాబాద్‌ మున్సిపాలిటీల్లో ఒక్కో గ్రామ పంచాయతీని విలీనం చేయనున్నారు.

Tags:    
Advertisement

Similar News