ఎల్బీనగర్ డీసీపీపై మధుయాష్కీ ఫైర్.. ల్యాండ్ సెటిల్మెంట్లలో బిజీ
ఎల్బీనగర్ డీసీపీ తీరుపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
రంగారెడ్డి జిల్లా డీసీపీ వ్యవహారశైలిపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ సీరియస్ అయ్యారు. డీసీపీ పూర్తి సమయం ల్యాండ్ సెటిల్మెంట్లలో నిమగ్నమయ్యారని విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం మాత్రం పార్ట్ టైమ్‌గా పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు.డీసీపీ తీరు మార్చుకుంటే మంచిదని.. లేదంటే సీఎం చర్యలు తీసుకుంటారని మధుయాష్కీ హెచ్చరించారు. మధుయాష్కీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.
Advertisement