రేవంత్‌పై ఈడీకి ఫిర్యాదు.. కేటీఆర్ ట్వీట్‌!

స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ కోరింది ఇందుకేనంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.

Advertisement
Update:2023-10-20 11:26 IST

రేవంత్‌పై ఈడీకి ఫిర్యాదు.. కేటీఆర్ ట్వీట్‌!

కాంగ్రెస్‌పై తన అటాక్‌ కొనసాగిస్తున్నారు మంత్రి కేటీఆర్‌. తాజాగా నోట్‌ ఫర్‌ సీట్ అంశాన్ని కాంగ్రెస్‌ నేతలే ఈడీ దృష్టికి తీసుకెళ్లిన అంశంపై ట్వీట్ చేశారు. ఓ వైపు స్కామ్‌గ్రెస్‌ వారసుడు రాహుల్ గాంధీ అవినీతిపై గురించి ఉపన్యాసాలు చెప్తుంటే, ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌పై, నోట్‌ ఫర్‌ సీట్ అంశంపై కాంగ్రెస్‌ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్‌ను రద్దు చేయాలని గాంధీజీ కోరింది ఇందుకేనంటూ సెటైర్లు వేశారు కేటీఆర్.


ఈ అంశానికి సంబంధించిన పేపర్ క్లిప్‌ను సైతం తన ట్వీట్‌కు జోడించారు కేటీఆర్. కాంగ్రెస్‌ బహిష్కృత నేతలు కురువ విజయ్‌ కుమార్‌, మహ్మద్ కలీముద్దీన్‌ నోట్‌ ఫర్‌ సీట్ అంశంపై ఈడీకి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రేల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని ఈడీని కోరారు. కాంగ్రెస్‌లో క్యాష్ ఫర్‌ టికెట్ అనే విధానం అమలవుతోందని ఆరోపించారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను పక్కన పెట్టేశారని, ఒకే ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు ఇవ్వడాన్ని తప్పుపట్టారు.

ఇక కాంగ్రెస్‌లో టికెట్‌ దక్కని అసంతృప్తులు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టికెట్ దక్కకపోవడంతో మేడ్చల్, మెదక్‌, గద్వాల డీసీసీలు పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Tags:    
Advertisement

Similar News