మెడికల్ కాలేజీల బదులు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉంటే..?

తెలంగాణలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే కచ్చితంగా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉండేదనే వాదనను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Advertisement
Update:2023-12-31 12:07 IST

తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి మాజీ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తిర ట్వీట్ వేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత పలు విశ్లేషణలు, ఉదాహరణలు, పోలికలు తన దృష్టికి వస్తున్నాయని ఆయన చెప్పారు. అందులో ఒకటి ఇది అంటూ ట్వీట్ చేశారు. కొంతవరకు తాను కూడా దాన్ని అంగీకరిస్తానంటున్నారు కేటీఆర్.


32 మెడికల్ కాలేజీలకు బదులు..

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరిగినా కూడా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని, అమలు చేయలేని, సాధ్యం కాని వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందనే వాదన ఉంది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే బీఆర్ఎస్ దే విజయం అని అంటున్నారు కొంతమంది నేతలు. అందులోనూ ఓటింగ్ పర్సంటేజీలో కూడా ఆ రెండు పార్టీలకు తేడా చాలా స్వల్పం. కానీ అదే అధికార మార్పుకి అవకాశమిచ్చింది. తెలంగాణలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టి ఉంటే కచ్చితంగా బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉండేదనే వాదనను కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని మరోసారి పరోక్షంగా గుర్తు చేశారు కేటీఆర్. కేంద్రం సహకరించకపోయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జిల్లాకో మెడికల్ కాలేజీని మొదలు పెట్టింది. తెలంగాణలో మొత్తం 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, వాటికి అనుబంధంగా ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మిస్తోంది. వైద్యరంగంలో నూతన విప్లవానికి నాంది పలికింది. కానీ ప్రజలు ఈ అభివృద్ధి కంటే, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్నే నమ్మారు. కాంగ్రెస్ నేతలది తప్పుడు ప్రచారం అని చెప్పే బలమైన వ్యవస్థను బీఆర్ఎస్ తయారు చేసుకోలేకపోయిందనే వాదన కూడా ఉంది. అందుకే కేటీఆర్ ఇప్పుడీ ట్వీట్ వేశారు. మెడికల్ కాలేజీలకు బదులు.. యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే వాదనను ఆయన కొంతవరకు సమర్థించారు.

Tags:    
Advertisement

Similar News