నాంపల్లి కోర్టులో స్టేట్‌మెంట్ ఇచ్చిన కేటీఆర్

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ దాఖలు చేసిన పరువు నష్టం దావా పై స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు కేటీఆర్ నాంపల్లి స్పెషల్ కోర్టు వచ్చారు. అనంతరం వాంగ్మూలం ఇచ్చారు.

Advertisement
Update:2024-10-23 17:00 IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ దాఖలు చేసిన పరువు నష్టం దావా పై స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు కేటీఆర్ నాంపల్లి స్పెషల్ కోర్టుకు వచ్చారు. వాంగూల్మం ఇచ్చారు. టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు కేటీఆర్ వల్లనే అయినవి కొండా సురేఖ కామెంట్స్ చేసిన నేపధ్యంలో సురేఖ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. మాజీమంత్రి వల్లనే కొంత మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారని జీవితంలో స్థిరపడ్డారని ఆమె పేర్కొంది. మరోవైపు పలువురికి డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు.

సినీ ఇండస్ట్రీ వాళ్ల జీవితాలతో ఆడుకొని.. వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా..? అంటూ ఆమె ప్రశ్నించారు. మరోవైపు కొండా సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు ఖండించారు.కేటీఆర్ వెంట న్యాయ‌వాదులు, మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, బాల్క సుమ‌న్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఉన్నారు. మేజిస్ట్రేట్‌ శ్రీదేవి ఆదేశాల మేరకు ఫిర్యాదుదారుడైన కేటీఆర్‌తోపాటు సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌ వాం గ్మూలాలను సైతం కోర్టు రికార్డు చేయనుంది. మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరై తన మీద దాఖలైన ఆరోపణల గురించి వివరణ ఇచ్చేందుకు అవకాశాన్ని కల్పిస్తూ కోర్టు నోటీసుల్ని జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను టీవీలో చూసి వాళ్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. మంత్రి కామెంట్స్‌తో నా ప‌రువు, ప్ర‌తిష్ట దెబ్బ‌తిన్నాయి. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం చేయాల‌ని కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌ని కేటీఆర్ త‌న వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 30వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News