మల్కాజ్ గిరిలో మడత పెట్టి కొట్టుడే..

100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించాకు కేటీఆర్.

Advertisement
Update:2024-02-04 19:20 IST

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వరుస మీటింగ్ లు నిర్వహిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు ఉప్పల్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికోసమే వచ్చాయేమోనని అన్నారు. కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు ఓ అవగాహన వచ్చిందన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని, ప్రస్తుతం తెలంగాణలో చీకటి పాలన ఉందన్నారు కేటీఆర్.


అధికారంలో ఉంది మనమా.. కాంగ్రెసోడా..?

ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదన్నారు కేటీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదేనని చెప్పారు. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరిలో మడత పెట్టి కొట్టుడేనంటూ సెటైర్లు పేల్చారు. 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారని, కాంగ్రెస్ మాటల ప్రభుత్వం మాత్రమేనని, చేతల ప్రభుత్వం కాదని జనం అప్పుడే తెలుసుకున్నారని అన్నారు కేటీఆర్.

బొంద పెట్టడం ఖాయం..

100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించాకు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి భాషను జనం అసహ్యించుకుంటున్నారని చెప్పారు. చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్టు రేవంత్ మాట్లాడుతున్నారని విమర్శించారు. లంకె బిందెలు కోసం తిరిగేవాళ్లని దొంగలు అంటారని, గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి లాగా తాము కూడా తిట్టగలం అన్నారు. కాంగ్రెస్ ది నికృష్ట పాలన అని జనాలకు ఇప్పటికే తెలిసొచ్చిందన్నారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News