రేవంత్ ప్రభుత్వానికి కేటీఆర్ అభినందనలు ఎందుకంటే?
సియోల్‌లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నిపుణులు పంపుతున్నందుకు రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సియోల్‌లో రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ను అధ్యయనం చేయడానికి సర్కార్ తరపున నిపుణులు, పర్యావరణవేత్తలు, హైడ్రాలజిస్టులు, ఇంజినీర్లు, బ్యూరోక్రాట్లను పంపుతున్నందుకు అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ బృందం మొత్తం అద్భుతమైన ఫలితాలతో తిరిగి వస్తుంది. ఇక ప్రజాధనం రూ. 1.5 లక్షల కోట్లను ఖర్చు చేయొచ్చని కచ్చితంగా సమర్థిస్తారని కేటీఆర్ ఎక్స్‌లో తెలిపారు .ఇక సౌత్ కొరియాలోని సియోల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం బృందం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పర్యటించనుంది. భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య, అధికారులతో పాటు పలు సంస్ధల జర్నలిస్ట్‌లు సియోల్ టూర్‌కు వెళ్లే వారిలో ఉన్నారు.