కౌంటింగ్ తర్వాతి రోజే రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియాకి జంప్..

ఎన్నికల ఫలితాలు ఈనెల 6న విడుదలవుతాయి. ఆ తర్వాతి రోజు.. అంటే 7వ తేదీ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న వ్యవహారం ఇప్పుడు బయటపడింది.

Advertisement
Update:2022-11-02 14:32 IST

రాజగోపాల్ రెడ్డి ఓటమిని అంగీకరించారా..? కనీసం పోలింగ్ జరిగే వరకయినా ఆయన ఆగలేకపోయారా..? ఆస్ట్రేలియాకు రాజగోపాల్ రెడ్డి టికెట్లు బుక్ చేసుకోవడం చూస్తుంటే తన పని అయిపోయినట్టే అని ఆయన ముందుగానే ఒప్పేసుకున్నట్టు అర్థమవుతోంది. అవును, కౌంటింగ్ మరుసటి రోజే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు. ఈమేరకు ఆయన పేరుతో ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ అయ్యాయి.

మునుగోడు పోలింగ్ గంటల వ్యవధిలోకి వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డికి ఏంచేయాలో పాలుపోవడంలేదు. ఓటమి దాదాపు ఖాయమైంది, ఓటమి తర్వాత మీడియాకు మొహం చూపలేరు, ప్రజల ముందుకు రాలేరు, కనీసం సహచర బీజేపీ నేతల ఫోన్లకు సైతం ఆయన జవాబు చెప్పుకోలేని పరిస్థితి. అందుకే ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న సోదరుడు వెంకట్ రెడ్డి దగ్గరకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. తీరిగ్గా అక్కడ సోదరులిద్దరూ అవమాన భారాన్ని దిగమింగుకోడానికి ఉమ్మడిగా తంటాలు పడతారన్నమాట.

ఆ నాలుగు ఓట్లు కూడా పడవా..?

గెలుపు సంగతి పక్కనపెడితే రాజగోపాల్ రెడ్డి మూడో స్థానానికి పరిమితం అవుతారని సర్వేలు చెబుతున్నాయి. ఆ స్థానానికి కేఏపాల్ గట్టి పోటీ ఇచ్చేట్టుగా ఉన్నారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బేరం ఎలాగూ జనాలకు తెలిసిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం చేసిన పెద్ద తప్పు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడటం. ఆ వ్యవహారం బయటపడ్డాక మరింతగా బీజేపీ పరువు దిగజారింది. తీరా ఎన్నికలకు మూడు రోజుల ముందు మునుగోడు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసిన సొమ్ముతో జనంలో మరింత పలుచన అయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఓటమిని గుర్తించిన ఆయన సేఫ్ సైడ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు ఈనెల 6న విడుదలవుతాయి. ఆ తర్వాతి రోజు.. అంటే 7వ తేదీ ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు రాజగోపాల్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్న వ్యవహారం ఇప్పుడు బయటపడింది. ఆయనే పారిపోతుంటే ఆయనకు వేసే ఆ ఒక్క ఓటు కూడా వృథా అని కొందరు బీజేపీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. అంటే డిపాజిట్లకు అవసరమైన ఆ నాలుగు ఓట్లు కూడా రాజగోపాల్ రెడ్డికి పడే అవకాశాలు లేవని స్పష్టమైపోయింది.

Tags:    
Advertisement

Similar News