అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది

"అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో.. ఉరకండి.. లగెత్తండి.. జల్దిపోయి రూ.2లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్‌ 9న నాడు 10.30గంటలకే సంతకం.. మొత్తం రూ.2లక్షల మాఫీ" అని రేవంత్ రెడ్డి బోగస్ మాటలు చెప్పారని విమర్శించారు కేసీఆర్.

Advertisement
Update:2024-04-25 22:27 IST

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని, అన్న వస్త్రానికి పోతే, ఉన్న వస్త్రం పోయిందని మొత్తుకుంటున్నారని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 420 హామీలు ఇచ్చిందని, ఆ హామీలు ఇప్పుడు అమలుచేయలేకపోతోందని ధ్వజమెత్తారు. మహిళలకు రూ.2500 ఇస్తామని మోసం చేశారని, గృహజ్యోతి సరిగా అమలు కావడంలేదని, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పి లూటీలు మొదలు పెట్టారని విమర్శించారు. బస్ యాత్రలో భాగంగా భువనగిరి రోడ్ షో లో ప్రసంగించారు కేసీఆర్.


తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వడంలేదని, విద్యా వ్యవస్థను ఆగమాగం చేశారని అన్నారు కేసీఆర్. తమ హయాంలో గురుకులాలు పెడితే కాంగ్రెస్ వచ్చి పిల్లలకు కల్తీ అన్నం పెడుతోందన్నారు. 135 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లోపడ్డారని, నలుగురు పిల్లలు చనిపోయారని, భువనగిరిలో ఓ అమ్మాయి చనిపోయిందని, ఇదెక్కడి ఘోరం అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు తమ హయాంలో సగం ధరకే రంగులు, రసాయనాలు ఇచ్చామని, వాళ్ల బతుకులు కాపాడామని వివరించారు కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో అది కూడా బంద్ పెట్టారన్నారు.

నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించలేదని, మెగా డీఎస్సీ లేదని, అంతా బోగస్సేనని అన్నారు కేసీఆర్. "అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో.. ఉరకండి.. లగెత్తండి.. జల్దిపోయి రూ.2లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్‌ 9న నాడు 10.30గంటలకే సంతకం.. మొత్తం రూ.2లక్షల మాఫీ" అని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పుడు చప్పుడు చేయడంలేదని, తులం బంగారం తుస్సుమన్నదని, అంతా బోగస్ అని ఇప్పుడు ప్రజలకు అర్థమైందని చెప్పారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయని, కనీసం ఆ కుటుంబాలను సీఎం కానీ, మంత్రులు కానీ పరామర్శించలేదని అన్నారు కేసీఆర్. ఆత్మహత్యలు చేసుకున్నవారి లిస్ట్ కావాలని అడిగారని, వెంటనే పంపించామని, కానీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదన్నారు. మిల్లర్ల కమీషన్ దొబ్బి ధాన్యం కొనుగోళ్లలో గోల్ మాల్ చేశారని విమర్శించారు కేసీఆర్. 

Tags:    
Advertisement

Similar News