పరిశ్రమల ఏర్పాటుకు కీలక నిర్ణయం
మొన్నటి సదస్సులో రూ. 13.5 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరిగిన విషయం తెలిసిందే. అవన్నీ వాస్తవరూపంలోకి రావాలంటే ఫాలో అప్ విధానమే బెస్ట్ అని ప్రభుత్వం భావించింది. ఇందుకోసమని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతివారం సమీక్ష జరపబోతోంది.
సదస్సులు జరిగినప్పుడు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏవేవో ప్రకటిస్తారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, సదస్సు కూడా అయిపోతుంది. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలెన్ని అని లెక్కచూసుకుంటే జరిగిన ఎంవోయూలకు వాస్తవ పరిస్థితికి పొంతనే ఉండదు. ఇప్పటివరకు ఏపీలో జరిగింది ఇదే పద్ధతి. అలాంటిది పాత పద్ధతులకు స్వస్తిచెప్పి ఎంవోయూలకు, పరిశ్రమల ఏర్పాటుకు వాస్తవరూపాన్ని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.
ఇంతకీ ఆ పద్ధతి ఏమిటంటే ఫోలోఅప్పే బెస్ట్ విధానం. మొన్నటి సదస్సులో రూ. 13.5 లక్షల కోట్ల విలువైన ఎంవోయులు జరిగిన విషయం తెలిసిందే. రిలయన్స్, అదానీ, జిందాల్, జీఎంఆర్, బిర్లా, ఎన్టీపీసీ లాంటి ప్రముఖ గ్రూపులు భారీ ఎత్తున ఎంవోయూలు చేసుకున్నాయి. అవన్నీ వాస్తవరూపంలోకి రావాలంటే ఫాలో అప్ విధానమే బెస్ట్ అని ప్రభుత్వం భావించింది. ఇందుకోసమని చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతివారం సమీక్ష జరపబోతోంది.
ప్రతి నెలా మూడు పరిశ్రమలు గ్రౌండయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. పరిశ్రమల యాజమాన్యాలను ఫాలో అప్ చేయటం వల్ల వాళ్ళలో కూడా ఇంట్రస్ట్ పెరిగి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ప్రభుత్వం అనుకుంటోంది. జరిగిన ఎంవోయూలన్నీ నూరు శాతం వాస్తవ రూపంలోకి రావని అందరికీ తెలిసిందే. ఎంవోయూలు చేసుకున్న యాజమాన్యాలన్నీ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రావచ్చు లేదా కొందరు వెనక్కు వెళ్ళచ్చు. అందుకనే ఫాలో అప్ చాలా అవసరం.
పరిశ్రమలకు కేటాయించటానికి ప్రభుత్వం దగ్గర రెడీగా 50 వేల ఎకరాలున్నాయి. అవసరమైతే రైతుల నుండి లీజు పద్ధతిలో భూములను సేకరించి పరిశ్రమలకు కేటాయించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఏదేమైనా వీలైనన్ని పరిశ్రమలను గ్రౌండ్ చేయించాల్సిన అవసరం జగన్‌కు ఉంది. ఎందుకంటే రాబోయేది ఎన్నికల సంవత్సరం. తన హయాంలో పరిశ్రమలు రాకపోగా పారిపోతున్నాయని ఆరోపిస్తున్న వాళ్ళకి రెండురోజుల సదస్సుతో జగన్ గట్టి సమాధానమే చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా నోళ్ళు శాశ్వతంగా మూతపడాలంటే పరిశ్రమలు గ్రౌండ్ చేయించటం జగన్‌కు చాలా అవసరం. మరిందులో కూడా జగన్ సక్సెస్ అవుతారా?