పనిచేసింది మేము.. పనులవుతున్నవి వాళ్లకు

ప్రభుత్వ కార్యాలయాల్లో పార్టీ మారిన నేతల హవానే కొనసాగుతున్నంటున్న కాంగ్రెస్‌ లీడర్లు, కార్యకర్తలు

Advertisement
Update:2024-11-22 12:49 IST

రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నేతలు, కార్యకర్తల నుంచి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వానికి నిరసన వ్యక్తమౌతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయినా పనులన్నీ పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ నేతలకే అవుతున్నాయని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నారు. తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్లలో గులాబీ పార్టీ లీడర్ల హవా కొనసాగుతున్నదని వాపోయారు. బైటి నుంచి వచ్చి వారితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్న సమావేశంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికైనా పార్టీ, ప్రభుత్వ పదవులు భర్తీ చేయాలని పలువురు నేతలు పీసీసీ అధ్యక్షుడిని కోరారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి, సీతక్క తోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌లు, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడిన వారికి న్యాయం జరగడం లేదని పార్టీ కార్యకర్తలు, నేతలు ఫైర్‌ అయినట్టు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్లలో కాంగ్రెన్‌నేతలకు విలువ లేకుండా పోయిందన్నారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన మాకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు వారి అనుచరులకే పదవులు ఇప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకు పూర్తిగా అవగాహన ఉన్నదని , తాను, సీఎం రేవంత్‌ కృషి చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ తెలిపారు. కష్టపడి పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కోరారు. భట్టి జోక్యం చేసుకుని త్యాగాలు చేసి వారికి ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. నామినేటెడ్‌ పదవుల్లోనే పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News