రాజగోపాల్ రెడ్డిలో అసహనం.. ప్రచారంలో బూతులే బూతులు..
రాజగోపాల్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతున్నట్టు స్పష్టమవుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రచారానికి రావట్లేదు, రాష్ట్ర నాయకత్వం ఆయనకు సహకరించట్లేదు. ఈ ప్రభావం అంతా ఎన్నికల ప్రచారంలో కనపడుతోంది.
సమయం దగ్గరపడేకొద్దీ మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోంది. మునుగోడు ప్రచారంలో బూతుల పర్వానికి ఆయన తెరలేపారు. మునుగోడులో ప్రచారానికి వెళ్లిన ఆయన.. అక్కడ కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లాలని, లేకపోతే తమ కుర్రాళ్లకు పనిచెప్పాల్సి ఉంటుందని రెచ్చిపోయారు. ఏయ్.. నా---, దొంగనా-- అంటూ రెచ్చిపోయారు. తానేదో ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి, అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నిస్తుంటే, తనని ఎవరూ అర్థం చేసుకోవడంలేదని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి.
మునుగోడు ప్రచారంలో కొంతమంది రాజగోపాల్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులపై నిలదీశారు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. బహిరంగ వేదికపైనే ఆయన బూతులు మాట్లాడారు. తనలో ఉన్న అసహనాన్ని అలా ప్రదర్శించారు. ఈ ప్రచారంలోనే కాషాయ జెండాలతోపాటు, టీడీపీ జెండాలు కూడా రెపరెపలాడటం విశేషం.
రాజగోపాల్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతున్నట్టు స్పష్టమవుతోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రచారానికి రావట్లేదు, రాష్ట్ర నాయకత్వం ఆయనకు సహకరించట్లేదు. ఈ ప్రభావం అంతా ఎన్నికల ప్రచారంలో కనపడుతోంది. 18 వేల కోట్ల కాంట్రాక్టు విషయంలో తనకు తానే అడ్డంగా బుక్కయ్యేసరికి ఏంచేయాలో ఆయనకు తెలియడంలేదు. కాంగ్రెస్ నుంచి తనతోపాటు వస్తారనుకున్న నాయకులు బీజేపీలోకి రాలేదు, ఓటుకు నోటు ఫలితం చూపిస్తుందా.. లేదా.. అనేది కూడా అనుమానంగా మారింది. ఈలోగా స్థానిక ప్రజాప్రతినిధులంతా టీఆర్ఎస్ లో చేరుతుండే సరికి బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ఆయన మాటలు కంట్రోల్ తప్పాయి. ప్రచారం కోసం వచ్చి ఇలా ప్రజలపై నోరు పారేసుకోవడం ఆయనకే చెల్లిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.