నిరుద్యోగుల కలలు సాకారం చేసేందుకు వచ్చాను : టీజీపీఎస్సీ ఛైర్మన్

టీజీపీఎస్సీ కార్యాలయం లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేసారు.

Advertisement
Update:2024-12-05 18:24 IST

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడిన బుర్రా వెంకటేశం..టీజీపీఎస్సీ ఛైర్మన్ కు ఉన్నా విస్తృత అధికారాలను వినియోగించుకొని న్యాయం చేస్తాని తెలిపారు. తెలంగాణ గెలిచి నిలవాలి. ఐఏఎస్ కావాలని నా కల సాకారం అయింది.. రాజీనామా చేశాను. ఇప్పుడు నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చాను అని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.

ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో పాటు భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని హామీ ఇచ్చారు. కమిషన్‌పై నమ్మకంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు. జనగామ జిల్లా ఓబుల్‌ కేశవాపురం గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం పేద బీసీ కుటుంబం నుంచి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తొలి గురుకుల పాఠశాల సర్వేల్‌లో చదువుకున్నారు. 1989లో హైదరాబాద్‌లోని అంబేడ్కర్‌ కళాశాల నుంచి బీఏ, 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1995లో ఐఏఎస్‌కు ఎంపికై ఏపీ కేడర్‌కు వచ్చారు.

Advertisement

Similar News