హైదరాబాద్ బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్
హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్ధభవన్‌లోని బీ-బ్లాక్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.ఏ చట్టం ప్రకారం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్న ప్రశ్నలు తలెత్తడంతో.. జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్‌ఎంసీ చట్టంలో కొత్తగా 374 బీ సెక్షన్‌ను చేర్చింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలు కూడా హైడ్రాకు ఇప్పటికే ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.