వైద్య, ఐటీ రంగాల్లో ముందంజలో హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని గవర్నర్ తమిళిసై అన్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు. రాష్ట్ర అభివృద్దికి తాను అన్నివిధాలా సహకారం అందిస్తానని తెలిపారు.
రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని, ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి వేడుకలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ . శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు. రాష్ట్ర అభివృద్దికి తాను అన్నివిధాలా సహకారం అందిస్తానని తెలిపారు.
అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్, బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్ తమిళిసై సన్మానించారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవాన్ల స్థూపం వద్ద గవర్నర్ నివాళులర్పించారు.