బీఆర్ఎస్ మహా ధర్నాకు హైకోర్టు అనుమతి

మహబూబాబాద్ జిల్లా మహా ధర్నా పై హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించింది

Advertisement
Update:2024-11-21 16:43 IST

మానుకోట బీఆర్ఎస్ మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మహా ధర్నా కార్యక్రమం చేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది. వికారాబాద్ ‘లగచర్ల’ గిరిజనులకు మద్దతుగా కేటీఆర్ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

దీంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కొడంగల్ , లగచర్ల బాధిత గిరిజన రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి కేటీఆర్ నేతత్వంలో మహాధర్నా నిర్వహించ తలపెట్టారు. ఈ ధర్నాకు చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    
Advertisement

Similar News