రేవంత్ రెడ్డి సీఎం కావొచ్చు కానీ, ఉద్యమకారుడు కాలేరు

తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్లలో కూడా జై తెలంగాణ అనే ప్రస్తావన లేకపోవడం గమనార్హం అని చెప్పారు హరీష్ రావు.

Advertisement
Update:2024-06-03 14:23 IST

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈరోజు హరీష్ జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న హరీష్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఎప్పటికీ ఉద్యమకారుడు కాలేరన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం అయి ఉండొచ్చు కానీ ఎప్పటికీ ఉద్యమకారుడు కాలేరన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారి పిల్లలు తన తండ్రి ఉద్యమకారుడని గర్వంగా చెప్పుకుంటారని, కానీ రేవంత్ రెడ్డికి అలాంటి అవకాశం లేదన్నారు. ఉద్యమ కారులపై తుపాకీ గురిపెట్టిన రేవంత్ ఉద్యమ ద్రోహి అంటూ దుయ్యబట్టారు హరీష్.


జై తెలంగాణ ఎక్కడ..?

బీఆర్ఎస్ పార్టీ తరపున, లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారికంగా విడుదల చేసే ఏ ప్రకటనలో అయినా జై తెలంగాణ అనే పదం ఉంటుందని గుర్తు చేశారు హరీష్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే ప్రకటనల్లో కూడా జై తెలంగాణ అనే పదమే లేదన్నారు. ఆఖరికి తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్లలో కూడా జై తెలంగాణ అనే ప్రస్తావన లేకపోవడం గమనార్హం అని చెప్పారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని కాంగ్రెస్ నేతలు ఖతం చేస్తారని హెచ్చరించారు హరీష్ రావు.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని అన్నారు హరీష్ రావు. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ అని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కాపాడాలంటే కేసీఆరే శ్రీరామ రక్ష అన్నారు హరీష్. 

Tags:    
Advertisement

Similar News