లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధింపులు..లారీ ఓనర్ ఆత్మహత్యాయత్నం
పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయం వద్ద లారీ ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యచేసుకునేందుకు ఓ లారీ ఓనర్ ప్రయత్నించాడు.
లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు నిత్యం వేధిస్తున్నారని ఓ లారీ ఓనర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారిపైన అక్రమ కేసు పెట్టారని, నెలకు ఒక్కో లారీ నుండి రూ.8000 లంచం తీసుకుంటున్నారని లారీ ఓనర్ అనిల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టారని సదరు లారీ యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వద్ద అన్ని ధృవపత్రాలు సరిగా ఉన్నా కూడా కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు లారీ విడిపించలేదని ఈ క్రమంలోనే లారీ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం.కాగా, ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని లారీ ఓనర్ డిమాండ్ చేశాడు.