డీలిమిటేషన్‌పై తెలంగాణ అఖిలపక్ష సమావేశం ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది.;
Advertisement
తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. డీలిమిటేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిలపక్ష సమావేశం జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి జానారెడ్డి, జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి వంటి సీనియర్ నాయకులు హాజరయ్యారు.
అయితే, ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రతినిధులు హాజరుకాలేదు. డీలిమిటేషన్ పై అఖిలపక్షం నిర్వహిస్తామని అధికార కాంగ్రెస్ అంటుంది. ఈ నెల 22న స్టాలిన్ భేటీ కంటే ముందే తెలంగాణలో అఖిలపక్ష భేటీ ఉంటుందని తెలుస్తోంది. 2026 తర్వాత పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత.. అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని బీజేపీ చెప్తుంది.
Advertisement