హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి.;

Advertisement
Update:2025-03-17 19:51 IST

తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్‌ను ఇవాళ టీజీపీఎస్సీ ప్రకటించింది. తుది జాబితాను అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో పొందుపరిచినట్లు తెలిపింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళాశిశు సంక్షేమశాఖల పరిధిలోని వసతి గృహాల్లో 562 అధికారులు శిశు సంరక్షణ గృహాల్లో 19 మహిళాసూపరింటెండెంట్ పోస్టులకు 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 298 పోస్టులు ఉన్నాయి. బీసీ సంక్షేమశాఖలో గ్రేడ్-2 మొత్తం 140 పోస్టుల్లో ప్రీ మెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 87, పోస్టుమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 14, ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 26, పోస్టు మెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 13 ఖాళీలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News