''భూ భారతి''కి గవర్నర్ ఆమోదముద్ర
గెజిల్ కాపీని మంత్రి పొంగులేటికి అందజేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
Advertisement
ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ ను రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గురువారం సెక్రటేరియట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. ఈ చట్టాన్ని తర్వలోనే అమల్లోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. ప్రజలకు మరింత మెరుగైన, సత్వర సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకువచ్చేందుకే ఈ చట్టాన్ని రూపొందించామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్ పని చేయాలని సూచించారు.
Advertisement