హైదరాబాద్‌లో గూగుల్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ రిప్లయ్.!
ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ సైతం హైదరాబాద్‌లోనే ఉందని ట్వీట్‌లో వివరించారు
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా బయట తన అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థ.. తన క్యాంపస్‌ను అమెరికా వెలుపల నిర్మించడం.. అందుకోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం గొప్ప విషయంగా అభివర్ణించారు. ఇది కేవలం కమర్షియల్ న్యూస్ మాత్రమే కాదని.. జియో పొలిటికల్ స్టేట్‌మెంట్ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై స్పందించారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ సైతం హైదరాబాద్‌లోనే ఉందని ట్వీట్‌లో వివరించారు కేటీఆర్. వీటితో పాటు యాపిల్, మెటా, క్వాల్‌కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఉబర్, సేల్స్‌ఫోర్స్ లాంటి మరెన్నో దిగ్గజ సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇదంతా గత 9 ఏళ్లలో జరిగిందని, హ్యప్పెనింగ్ హైదరాబాద్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. అమెజాన్ క్యాంపస్‌కు సంబంధించిన చిత్రాన్ని సైతం తన ట్వీట్‌కు జత చేశారు కేటీఆర్.
హైదరాబాద్ గచ్చిబౌలిలో 7.3 ఎకరాల్లో 30.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ తన క్యాంపస్‌ను నిర్మిస్తోంది. 2022 ఏప్రిల్‌లో ఈ భవన నిర్మాణానికి ఐటీ మినిస్టర్ కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 2015లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో 2019లో గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలాన్ని గూగుల్ కొనుగోలు చేసింది. దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పని చేసేందుకు వీలుగా అత్యాధునిక టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.