నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. త్వరలో మెగా డీఎస్సీ

త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలకు డీఎస్‌సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement
Update:2024-12-14 18:12 IST

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలకు డీఎస్‌సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం, మ‌ధిర‌, బోన‌క‌ల్‌లోని సంక్షేమ‌, గురుకుల పాఠ‌శాలల‌ను త‌నిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఈ సంద‌ర్భంగా నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా అన్ని సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ ఛార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డార‌ని తెలిపారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా డైట్ ఛార్జీల‌ను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీల‌ను 200 శాతం పెంచామ‌న్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ గురుకులాాలు, హాస్టళ్లకు కొత్త బిల్డింగ్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 చార్జీలుంటే.. సవరించి రూ.2100 చెల్లిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు

Tags:    
Advertisement

Similar News