హోంగార్డులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు

రాష్ట్రంలోని హోంగార్డుల డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏను రూ.921 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Update:2024-12-06 20:35 IST

తెలంగాణలో హోంగార్డులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను రూ.921 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. వీక్లీ పరేడ్‌ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అలాగే విధుల్లో చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇది అమలులోకి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా హైదరాబాద్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్ హోం శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా పలు స్టాల్స్ లను ఏర్పాటు చేయగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు వాటిని పరిశీలించారు.

హోంగార్డులకు హెల్త్ కార్డ్ లు కూడా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, నూతన సంవత్సరంలో నూతన ఆదేశాలు అమలవుతాయని ముఖ్యమంత్రి అన్నారు. పోలీస్ కుటుంబాల పిల్లల చదువుల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. అందుకు 50 ఎకరాలలో స్కూల్ నిర్మించడం జరుగుతుందని, హోం గార్డ్ నుండి డీజీపీ స్థాయి అధికారి పిల్లలకు ఉచిత విద్యను కార్పొరేట్ స్థాయిలో అందిస్తామనన్నారు రాష్ట్రంలో సుమారు 94 వేల మంది పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి ఉత్తమ విధులతోనే రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణలో ఎప్పుడూ ముందంజలో ఉందని సీఎం అన్నారు.

Tags:    
Advertisement

Similar News