నిజామాబాద్ ఐటీ హబ్ లో గ్లోబల్ లాజిక్..

అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో లోని క్యాంపస్ లలో దాదాపు 3 వేల మందికి ఉపాధి కల్పించింది గ్లోబల్ లాజిక్. ఇప్పుడు నిజామాబాద్ లో కూడా తమ క్యాంపస్ ప్రారంభించబోతోంది.

Advertisement
Update:2023-07-31 16:17 IST

నిజామాబాద్ ఐటీ హబ్‌ లో కంపెనీ స్థాపించాలంటూ హిటాచీ గ్రూప్ సబ్సిడరీ సంస్థ అయిన గ్లోబల్ లాజిక్ ప్రతినిధులను కోరారు ఎమ్మెల్సీ కవిత. తన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని చెప్పారామె. యువతకు స్థానికంగా ఐటీ ఉద్యోగావకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేస్తున్నారని, త్వరలో ప్రారంభించబోతున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో ప్రతిష్టాత్మక కంపెనీల భాగస్వామ్యాన్ని కోరుతున్నట్టు చెప్పారు.

గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఐటీహబ్ లో పెట్టుబడులు పెట్టాలని ఆమె కోరారు. రవాణా, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రతల గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్ ఐటీహబ్ లో ఉద్యోగాల విషయంలో మహిళలకు పెద్దపీట వేస్తామని గ్లోబల్ లాజిక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. రేపు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్ ని సందర్శిస్తారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్లోబల్ లాజిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఆ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో లోని క్యాంపస్ లలో దాదాపు 3 వేల మందికి ఉపాధి కల్పించింది గ్లోబల్ లాజిక్. ఇప్పుడు నిజామాబాద్ లో కూడా తమ క్యాంపస్ ప్రారంభించబోతోంది. 

Tags:    
Advertisement

Similar News