గచ్చిబౌలి ఏడీఈ అక్రమాస్తులు రూ.100 కోట్లు

గచ్చిబౌలి విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Advertisement
Update:2025-02-15 21:08 IST

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిశాఖ విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఆయనకు స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఖాళీ స్థలాలు, ఒక విల్లా, భవనాలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువనే రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అతని నివాసం నుండి బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏడీఈ సతీశ్ రెడ్డి రూ.50 వేలు లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి చిక్కాడు. దీంతో నిన్నటి నుండి ఆయన నివాసంలో, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

Tags:    
Advertisement

Similar News