TS కాదు TGనే.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది.
తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను TS నుంచి TGగా మార్చారు. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ TG మార్క్‌తోనే జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ విడుదల చేసింది.
మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29A కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న TS స్థానంలో ఇప్పుడు TG మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది.
TS నుంచి TGగా మార్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో TGగా మార్చాలని కేబినెట్ సమావేశంలోనూ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా మంగళవారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ TGగా ఉండనుంది.