నల్లగొండలో మళ్లీ ఫుడ్ పాయిజన్.. విద్యార్థినులు అస్వస్థత
తెలంగాణలో మరోసారి కలుషిత ఆహారం కారణంగా మోడల్ స్కూల్ బాలికలు అస్వస్థతకు గురయ్యారు
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. తాజాగా నల్లగొండ జిల్లాలో కలుషిత ఆహారం కారణంగా మోడల్ స్కూల్ హాస్టల్‌లో బాలికలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను ఆసుపత్రికి తరిలించారు. నిన్న రాత్రి ఐదుగురు బాలికలు ఆసుపత్రిలో చేరగా.. ఈరోజు మరో ఇద్దరు కడుపు నొప్పితో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో, బాలికల సంఖ్య ఏడుకు చేరుకుంది. నల్లగొండ జిల్లాలోని దుగ్యాల మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, తీవ్రమైన కడపు నొప్పి రావడంతో వారికి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను కలెక్టర్ ఇలా త్రిపాఠి రాత్రి పరామర్శిచారు. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. విద్యార్థినలకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
రాష్ట్రంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరగలేదని.. రెండు మూడు రోజులుగా విద్యార్థులు సరిగా ఆహారం తీసుకోకపోడంతో నీరసంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. అయితే, బాలికలు మాత్రం.. తాము తిన్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు. మూడు రోజుల నుంచి భోజనం సరిగా ఉండటం లేదు. వార్డెన్‌కి చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్ధులు వాపోయారు. అన్నం సరిగా ఉడకడం లేదని. సగం ఉడికించిన అన్నం పెట్టడంతో అదే తినాల్సి వస్తోంది. మూడు రోజుల నుంచి కడుపునొప్పి వస్తోంది. మాకు పెట్టే భోజనంలో క్వాలిటీ లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.