హీరోహీరోయిన్ల పోలింగ్ బూత్ లు.. ఈరోజు ట్రెండింగ్ సబ్జెక్ట్ ఇదే

సినీ సెలబ్రిటీల ఓటింగ్ విషయానికొస్తే.. ఉదయాన్నే వారంతా పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేస్తారు. తాము ఓటు వేసి, మీరంతా ఓటు వేయండి అంటూ తమ వేలికున్న సిరా చుక్కను చూపిస్తూ ఫొటోలు దిగి ప్రజలకు సందేశమిస్తారు.

Advertisement
Update:2023-11-29 17:44 IST

ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసిపోవడంతో ఈరోజు మీడియా, సోషల్ మీడియాలో కూడా పెద్దగా హడావిడి కనపడ్డంలేదు. కాసేపటి నుంచి సెలబ్రిటీల పోలింగ్ బూత్ ల వివరాలు మాత్రం ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇక చూస్కోండి మీడియా కూడా పదే పదే ఇవే వార్తలు చూపిస్తోంది. మహేష్ బాబు ఫలానా పోలింగ్ బూత్ కి వస్తారు, విజయ్ దేవరకొండ ఫలానా చోట ఓటు వేస్తారు, హీరో చిరంజీవి, రామ్ చరణ్ పోలింగ్ బూత్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం సినీ సెలబ్రిటీల పోలింగ్ బూత్ ల వివరాలు ఇలా ఉన్నాయి.

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేష్ బాబు, నమ్రత, మంచు మోహన్‌ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌

(పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, శ్రీకాంత్‌

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్‌

(పోలింగ్‌ బూత్‌ 160): విశ్వక్ సేన్

(పోలింగ్‌ బూత్‌ 166): దగ్గుబాటి రానా, సురేష్ బాబు,

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, నితిన్‌

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ

ఓబుల్‌ రెడ్డి స్కూల్‌(పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి

BSNL సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌ (పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌

మణికొండ (హైస్కూల్): ప్రభాస్, అనుష్క, వెంకటేష్, బ్రహ్మానందం

షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి, రమా రాజమౌళి

రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ -ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేష్

యూసఫ్‌ గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి

సినీ సెలబ్రిటీల ఓటింగ్ విషయానికొస్తే.. ఉదయాన్నే వారంతా పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేస్తారు. ఉదయాన్నే తాము ఓటు వేసి, మీరంతా ఓటు వేయండి అంటూ తమ వేలికున్న సిరా చుక్కను చూపిస్తూ ఫొటోలు దిగి ప్రజలకు సందేశమిస్తారు. అటు మీడియాకు కూడా సెలబ్రిటీల ఓటు సేలబుల్ వార్త అవుతుంది. అందుకే ఆయా పోలింగ్ బూత్ ల వద్ద ఉదయాన్నుంచే ప్రత్యేక డ్యూటీలు మొదలవుతాయి. 


Tags:    
Advertisement

Similar News