రైతులు ఆశపడుతారు తప్ప అడుక్కోరు

సమయం రాక పోదు మీకు గుణపాఠం చెప్పక పోరు : కేటీఆర్‌

Advertisement
Update:2024-12-07 10:52 IST

రైతులు ఆశపడుతారే తప్ప ఎప్పడూ అడుక్కోరని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఎంతసేపు రైతుబంధు కావాలి.. బీమా కావాలి.. రుణమాఫీ కావాలని రైతులు అడుక్కోవద్దంటూ మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావుకు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి 'ఎక్స్‌' వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ''రైతే రాజు నినాదం కాదు కేసీఆర్ ప్రభుత్వ విధానం.. అడగకుండానే రైతుబంధు.. అడగకుండానే రైతుబీమా.. అడగకుండానే సాగునీళ్లు.. అడగకుండానే ఉచితంగా 24 గంటల కరంటు.. అడగకుండానే 100 శాతం పంటల కొనుగోళ్లు.. దశాబ్దాల కాంగ్రెస్ పాలనతో వ్యవసాయ రంగం వెన్నువిరిగి బతుకుదెరువు కోసం వలస బాట పట్టిన అన్నదాతలలో ఆత్మవిశ్వాసం నింపి వ్యవసాయం దండగ కాదు పండగ అని చాటిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది.. కరోనా విపత్తులోనూ కర్షకులకు బాసటగా నిలిచిన చరిత్ర కేసీఆర్‌ది.. ప్రతి ఊరికీ వెళ్లి పంటలు కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌ది.. రైతుబంధును రాజకీయం చేసి రైతుభరోసా అంటూ భ్రమలు కల్పించి.. రైతుబీమాను మాయం చేసి.. 24 గంటల ఉచిత విద్యుత్తును ప్రశ్నార్థకం చేసి.. పంటల కొనుగోళ్లకు పాతరవేసి.. సాగునీళ్లను సాగనంపి.. అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి రైతును రహదారులపైకి లాగిన మీరా.. రైతుల గురించి మాట్లాడేది? రైతుభరోసాకు ఎగనామం పెట్టి.. రుణమాఫీ పేరుతో కనికట్టు చేసినా మీరా .. రైతుల గురించి మాట్లాడేది? ఇల్లిల్లూ తిరిగి అబద్దపు హామీలు ఇచ్చి నాడు ఓట్లు అడుక్కున్న చరిత్ర మీది..అధికారం దక్కాక ఇల్లిల్లూ తిరిగి ఎమ్మెల్యేలను అడుక్కుని, కొనుక్కున్న చరిత్ర మీది.. రైతులు ఎప్పుడూ ఆశపడతారు తప్ప అడుక్కోరు.. సమయం రాక పోదు మీకు గుణపాఠం చెప్పక పోరు.. జాగో తెలంగాణ జాగో'' అని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News