46 ఏళ్లకు పట్టాదారు పాస్ బుక్
ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడంతో సమస్యకు పరిష్కారం
Advertisement
తన భూమికి పట్టాదారు పాస్ బుక్ కోసం 46 ఏళ్లుగా రైతు ఎదురు చూపులకు ప్రజావాణి కార్యక్రమం పరిష్కారం చూపించింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామానికి చెందిన కొమ్మనబోయిన పిచ్చయ్యకు ఎకరం భూమి ఉంది. 1978 నుంచి ఆ భూమికి పట్టాదారు పాస్ బుక్ కోసం పిచ్చయ్య దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వం ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జూలైలో పిచ్చయ్య దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ శాఖ ఆయన దరఖాస్తును పరిశీలించి పాస్ బుక్ జారీ చేసింది. మంగళవారం ప్రజావాణి కార్యక్రమంలో పిచ్చయ్య ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య చేతుల మీదుగా పాస్ బుక్ తీసుకున్నారు.
Advertisement