తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదు..ఉద్యోగులతో సీఎం కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.

Advertisement
Update:2024-10-24 19:35 IST

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ శాంతికుమారి, సీఎం సమావేశమైనారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని విషయాలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ వస్తున్నామని సీఎం చెప్పారని జేఏసీ నేతలు తెలిపారు. భేటీ అనంతరం జేఏసీ సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. 51 డిమాండ్లపై ముఖ్యమంత్రి మాతో చర్చించారని.. 11 సంవత్సరాల తర్వాత ఆరోగ్యకర వాతవరణంలో చర్చలు జరిగాయన్నారు. గతంలో ఇలాంటి చర్చలు జరగలేదన్నారు.

317 జీవో, హెల్త్ కార్డులు, డీఏలు, పీఆర్‌సీ, సీపీఎస​ విధానంప కూడా చర్చించినట్లు ఆయన తెలిపారు. దీపావళి తర్వాత కేబ్‌నెట్ సబ్ కమిటీ 51 సమస్యలపై చర్చిస్తుందని తెలిపారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్లు వారు తెలిపారు. బదిలీలు, ఉద్యోగుల సర్వీసు అంశాలను పరిష్కరిస్తాం. వాటితో పాటు మిగతా అన్ని సమస్యలపై చర్చిస్తాం. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తాం’’ అని సీఎం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని వారు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం సబ్ కమిటీ నియమించారు. కమీటీలో మంత్రులు పొన్నం ప్రభారకర్, శ్రీధర్‌బాబు,ఎంపీ కేశవరావు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News