కేటీఆర్‌ ఫొటో చూస్తేనే వెంకట్‌రెడ్డికి భయమవుతున్నది

. మంత్రి వెంకట్‌రెడ్డికి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులు ఇబ్బందులు పడుతారు జగదీశ్ రెడ్డి వార్నింగ్

Advertisement
Update:2025-01-21 17:00 IST

నల్గొండ జిల్లాలో పోలీస్‌, కాంగ్రెస్‌ గుండాల రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి వెంకట్‌రెడ్డికి కేటీఆర్‌ ఫోబియా పట్టుకున్నది. కేటీఆర్‌ ఫొటో చూసినా గులాబీ రంగు చూసినా వెంకట్‌రెడ్డికి భయమవుతున్నదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు చించేశారు.

మంత్రి వెంకట్‌రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెంకట్‌రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులు ఇబ్బందులు పడుతారన్నారు. పోలీస్‌ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మంత్రి స్వయంగా ఫోన్‌ చేసి మాపై కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు. చిల్ల దాడులు మమ్మల్ని ఆపలేవన్నారు.

కాంగ్రెస్‌ పాపాల పుట్ట పగులుతుంది. కాంగ్రెస్‌ రహిత తెలంగాణ కోసం నల్గొండ నుంచే ఉద్యమం మొదలవుతుంది. కాంగ్రెస్‌ హఠావో తెలంగాణ బచావో నినాదం మొదలైంది. గుర్తుపెట్టుకోండి.. ఇప్పటికైనా మారకపోతే కాంగ్రెస్‌ మూల్యం చెల్లించక తప్పదన్నారు. గ్రామసభల్లో కాంగ్రెస్‌ నిజ స్వరూపం బైటపడుతుందన్నారు. రెండుసార్లు ప్రజల దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మోసాలపై ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు.

మంత్రి వెంకట్ రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. వెంకట్ రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులు ఇబ్బందులు పడుతారన్నారు. పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాపై కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడు. మున్సిపాలిటీ లో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు. చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవన్నారు.

మంత్రి కోమటిరెడ్డి అనుచరులు నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి చేశారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లిన పడిపోయారు. ప్రజా పాలన అంటే ప్రజల తరఫున ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయడమా?అని ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. 

Advertisement

Similar News